అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-5
సంపుటము: 1-5
రేకు: 1-5
సంపుటము: 1-5
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవునిఁ గొనియాడుఁడీ | ॥వేదం॥ |
అలరిన చైతన్యాత్మకుఁ డెవ్వఁడు కలఁ డెవ్వఁ డెచటఁ గలఁ డనిన తలఁతు రెవ్వనినిఁ దనువియోగదశ యిల నాతని భజియించుఁడీ | ॥వేదం॥ |
కడఁగి సకలరక్షకుఁ డిందెవ్వఁడు వడి నింతయు నెవ్వని మయము పిడికిట తృప్తులు పితరు లెవ్వనినిఁ దడవిన ఘనుఁ డాతనిఁ గనుఁడీ | ॥వేదం॥ |
కదిసి సకలలోకంబులవారలు యిదివో కొలిచెద రెవ్వనిని త్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుఁడీ | ॥వేదం॥ |