Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 100-5
సంపుటము: 1-505
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
సుఖమును దుఃఖమును జోడుకోడెలు
అఖిలముఁ గన్నవారు అడ్డమాడ రెపుడు
॥సుఖము॥
యెందాఁకా సంసార యెనసి తాఁ జేసేను
అందాఁక లంపటము లవి వోవు
కందువ జీవుఁడు భూమిఁ గాయ మెన్నాళ్ళు మోఁచె
అందుకొన్న తనలోని యాసలూఁ బోవు
॥సుఖము॥
అప్పటిఁ దనకు లోలో ఆఁక లెంతగలిగినా
తప్పక అందుకుఁ దగ దాహముఁ బోదు
అప్పు దనమీఁద మోఁచి అదె యెన్నాళ్లు వుండె
ముప్పిరి వడ్డివారక మూలనుండినాఁ బోదు
॥సుఖము॥
దైవముపై భక్తిలేక తనకు నెన్నాళ్లుండే
దావతి కర్మపు పాటు తనకుఁ బోదు
శ్రీవేంకటేశ్వరుని సేవ దన కెప్పు డబ్బె
వోవరి నందలి మేలు వొల్లనన్నాఁ బోదు
॥సుఖము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము