అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-1
సంపుటము: 1-507
శ్రీరంగం రేకు: 98-1
సంపుటము: 1-507
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| [1]ఇన్నిటికి మూలము యీతనిరూపు యెన్నఁగ నుపమలకు నిరవైనట్లుండె | ॥ఇన్నిటికి॥ |
| కమలనాభునికి కప్పురకాపు మేన సముచితముగఁ బైపై చాఁతినపుడు అమృతము దచ్చేవేళ నట్టే మేనఁ దుంపుర్లు తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె | ॥ఇన్నిటికి॥ |
| దైవశిఖామణికి తట్టుపుణుఁగు మేనను చేవమీర నించి సేవ సేసేయప్పుడు వేవేలుగా యమునలో వేమారు నీఁదులాడఁగా కావిరి కాళిమ నిండాఁ గప్పినయట్టుండె | ॥ఇన్నిటికి॥ |
| అలుమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి- కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు కులికి గొల్లెతలను కూడఁగా గుబ్బలమీఁదఁ గల పసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె | ॥ఇన్నిటికి॥ |
[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.


