అధ్యాత్మ సంకీర్తన
రేకు: 101-2
సంపుటము: 2-2
రేకు: 101-2
సంపుటము: 2-2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| విడువరా దెంతైనా వెఱ్ఱివాఁడనైన నీకు కడవారు నవ్వకుండాఁ గాచుకో నన్నును | ॥పల్లవి॥ |
| జ్ఞానము నే నెఱఁగ నజ్ఞానముఁ నే నెఱఁగను మానను విషయములు మరిగెంతైనా నీనామము నొడిగి నాదాసుఁడ ననుకొందు దీనికే వహించుకొని తిద్దుకో నన్నును | ॥విడు॥ |
| అకర్మము నెఱఁగను సుకర్మము నెఱఁగను ప్రకటసంసారముపై పాటు మానను వొకపనివాఁడనై వూని ముద్రధారినైతి మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును | ॥విడు॥ |
| వెనకఁ గానను ముందు విచారించి కానను నినుపై దేహధారినై నీకు మొక్కేను ఘనుఁడ శ్రీవేంకటేశ కన్నులెదుటఁ బడితి కని పోవిడువరాదు కరుణించు నన్నును | ॥విడు॥ |


