అధ్యాత్మ సంకీర్తన
రేకు: 102-6
సంపుటము: 2-12
రేకు: 102-6
సంపుటము: 2-12
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు | ॥పల్లవి॥ |
| చుక్కలై యుండినవారు సురలై యుండినవారు యిక్కడనుండి పోయిన యీజీవులే దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు | ॥అయ్యో॥ |
| పాతాళవాసులను పలులోకవాసులును యీతరవాత నుండిన యీ జీవులే కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు | ॥అయ్యో॥ |
| యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు యిరవై మనలోనున్న యీజీవులే సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు | ॥అయ్యో॥ |


