అధ్యాత్మ సంకీర్తన
రేకు: 103-2
సంపుటము: 2-14
రేకు: 103-2
సంపుటము: 2-14
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అనుచు నిద్దరునాడే రమడలవలెనే మొనసి యివెల్లాఁ జూచి మొక్కిరి బ్రహ్మాదులు | ॥పల్లవి॥ |
| రాముఁడ పండ్లు నాకు రండు వెట్టరా యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు ప్రేమపుతమ్ముఁడఁ గాన పిన్ననే నీకు యీమాట మఱవకు యిందిరాకృష్ణుఁడా | ॥అను॥ |
| యెక్కిన వుట్టిపై నన్ను నెక్కించరా వోరి వుక్కునఁ బడేవు రాకు వద్దురా నీవు పక్కున మొక్కేరా నీపయిఁడికాళ్ళకు వోరి అక్కతోఁ జెప్పేఁ గాని అందుకొనే రారా | ॥అను॥ |
| యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి నివ్వటిల్ల నీవింత నిక్కవొద్దురా రవ్వల శ్రీవేంకటాద్రిరాయఁడనేరా అయితే- యివ్వల నీకంటేఁ బెద్ద యిది నీ వెఱఁగవా | ॥అను॥ |


