అధ్యాత్మ సంకీర్తన
రేకు: 103-3
సంపుటము: 2-15
రేకు: 103-3
సంపుటము: 2-15
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| పెట్టిన నీ వెఱుఁగుదు పెనుదిక్కు జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి | ॥పల్లవి॥ |
| కర్మమూలమైనట్టి కాయము మోచి నేను కర్మము విడువఁబోతే కడుసంగతా మర్మ మెఱిఁగిన నీవే మాయలఁ గట్టుండఁగాను పేర్మి నే విడువఁబోతే బిగియదా కట్టు | ॥పెట్టి॥ |
| బంధమూలమైనట్టి ప్రపంచమందునుండి బంధముఁ బాసేనంటేఁ బాసునా అది అంధకారమైనట్టి అజ్ఞానానఁ దోసితివి అంధకారమున వెలుఁ గరసితేఁ గలదా | ॥పెట్టి॥ |
| నిచ్చలు నీసంసారపు నీరధిలోన మునిఁగి చొచ్చి వెళ్లి చేరేనంటేఁ జోటు గలదా యిచ్చట శ్రీవేంకటేశ యిహమందే పరమిచ్చి అచ్చు మోపి యేలఁగా నే నన్నియుఁ దెలిసితి | ॥పెట్టి॥ |


