అధ్యాత్మ సంకీర్తన
రేకు: 104-4
సంపుటము: 2-22
రేకు: 104-4
సంపుటము: 2-22
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానునా మలసి కామ్యకర్మములకుఁ జొచ్చిన మగుడఁ బుట్టువులు మానునా | ॥పల్లవి॥ |
| పరగ నింద్రజిత్తుఁడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబునఁ గట్టి అరయ నందుపై మోకులు గట్టిన నలబ్రహ్మాస్త్రము వదలె పరిపరివిధముల నిటువలెనే హరిఁ బ్రపత్తి నమ్మిన నరుఁడు తిరుగఁ గర్మమార్గమునకుఁ జొచ్చిన దేవుఁడు దనవాత్సల్యము వదలు | ॥కల॥ |
| అలరిన సంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతుఁడు తలఁపుచు నొకయిఱ్ఱిఁ బెంచినంతనే తనకును నారూపు దగిలె ములుగుచు లంపటములు దెగ విడిచి మోక్షము వెదకెడి నరుఁడు వలవని దుస్సంగతులు పెంచినను వాసన లంటక మానునా | ॥కల॥ |
| అటుగన తాఁ బట్టిన వ్రత ముండఁగ నన్యమతము చేపట్టినను నటనల నెందునుఁ బొందక జీవుఁడు నడుమనె మోరుఁడైనట్లు తటుకస శ్రీవేంకటపతి నొక్కని దాస్యము భజియించిన నరుఁడు ఘటనల నాతని కైంకర్యములకు కడుఁబాత్రుఁడు గాక మానునా | ॥కల॥ |


