అధ్యాత్మ సంకీర్తన
రేకు: 104-5
సంపుటము: 2-23
రేకు: 104-5
సంపుటము: 2-23
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చెల్లఁబో యీజీవు లిలఁ జేసిన పాప మెంతో వుల్లమున నున్న హరి వూరికే దవ్వాయ | ॥పల్లవి॥ |
| కన్నచోటనే హరి కలఁడన్నవారికి విన్నచోటనే విష్ణుడు వివేకులకు వున్నతిఁ గొలువలేక వొద్దనుండఁగాఁ గొందరు మిన్నుమీఁద వెదకేరు మితిమీఱఁ జదివి | ॥చెల్లఁ॥ |
| పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు తిట్టులోనా దైవము దివ్యులకును ముట్టి చేత మొక్కలేరు ముందటనే వుండఁగాను బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల | ॥చెల్లఁ॥ |
| ఊపిరిలో దేవుఁడున్నాఁడు యోగీంద్రులకు దాపున నున్నాఁడు హరిదాసులకును యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక చాపలాన వెదకేరు సకలదేవతల | ॥చెల్లఁ॥ |


