అధ్యాత్మ సంకీర్తన
రేకు: 105-5
సంపుటము: 2-29
రేకు: 105-5
సంపుటము: 2-29
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| మఱి హరిదాసుఁడై మాయలఁ జిక్కువడితే వెఱపించఁబోయి తానే వెఱచినట్లవును | ॥పల్లవి॥ |
| శూరుఁడైనవాఁ డేడఁజొచ్చిన నడ్డము లేదు ఆరీతి జ్ఞానికి విధు లడ్డము లేవు కారణాన నప్పటినీఁ గలిగెనా నది మరి తేరిన నీళ్ల వండు దేరినట్లవును | ॥మఱి॥ |
| సిరులరాజై తే నేమిసేసిన నేరమి లేదు పరమాధికారియైతేఁ బాపము లేదు అరసి తనకుఁదానే అనుమానించుకొనెనా తెరువే పోఁ సుంకరిఁ దెలిపినట్లవును | ॥మఱి॥ |
| భూమెల్ల మేసినా నాఁబోతుకు బందె లేదు నేమపుఁ బ్రపన్నునికి నింద లేదు యీమేర శ్రీవేంకటేశ్వరుని శరణని సోమరి కర్మమంటితే జుంటీఁగ కతవును | ॥మఱి॥ |


