అధ్యాత్మ సంకీర్తన
రేకు: 105-6
సంపుటము: 2-30
రేకు: 105-6
సంపుటము: 2-30
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| నేమే బ్రహ్మమనుకో నేరము నేము- కామించిన స్వతంత్రము గడు లేదుగాన | ॥పల్లవి॥ |
| క్షణములోపలనె సర్వజీవావస్థలూను గణుతించేవాఁ డొకఁడు గలఁడు వేరే అణుమహత్త్వములందు నంతర్యామైనవాని ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని | ॥నేమే॥ |
| పనిగొని యేలుటకు బ్రహ్మాది దేవతలఁ గనిపించేవాఁ డొకఁడు గలఁడు వేరే ననిచి సిరుల లక్ష్మీనాథుఁడైనవాని- పనులవారము నేము బ్రదికేముగాని | ॥నేమే॥ |
| సతతరక్షకుఁడయి శంఖచక్రధరుఁడయి గతి శ్రీవేంకటపతి గలఁడు వేరే అతనిమఱఁగు చొచ్చి యానందపరవశానఁ బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని | ॥నేమే॥ |


