అధ్యాత్మ సంకీర్తన
రేకు: 106-2
సంపుటము: 2-32
రేకు: 106-2
సంపుటము: 2-32
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| వెన్నలు దొంగిలునాటి వెఱ్ఱివా నీవు విన్నకన్నజాడ గాదు వెఱ్ఱివా నీవు | ॥పల్లవి॥ |
| చేరి నిన్నునొల్లనట్టిజీవుల నీవుదరాన వీరుఁడవై మోఁచేవు వెఱ్ఱివా నీవు నారపేరు నుడిగితే నా పేరంటాఁ దగిలేవు వీరానఁ జుట్టమవై వెఱ్ఱివా నీవు | ॥వెన్న॥ |
| బంటులైనవారికిఁ బరతంత్రుఁడవై యీ- వెంటవెంట దిరిగేవు వెఱ్ఱివా నీవు అంటే ననరాదు రెండుఅడుకులకే చొచ్చేవు వింటే మాకు నవ్వువచ్చీ వెఱ్ఱివా నీవు | ॥వెన్న॥ |
| పావనులయి లోకమెల్లా బదుకుమంటాఁ బేళ్లు వేవేలు వెట్టుకొంటివి వెఱ్ఱివా నీవు శ్రీవేంకటేశుఁడవై చెంది వరము లిచ్చేవు వేవేగ నెవ్వరికైనా వెఱ్ఱివా నీవు | ॥వెన్న॥ |


