అధ్యాత్మ సంకీర్తన
రేకు: 106-4
సంపుటము: 2-34
రేకు: 106-4
సంపుటము: 2-34
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| కరుణించు మిఁకనైన కాఁపురమా కరికరిఁ బెట్టకుమీ కాఁపురమా | ॥పల్లవి॥ |
| కలలోని సుఖమైన కాఁపురమా కలుషమే చవియైన కాఁపురమా కలను బేహారపు కాఁపురమా కలఁడు మా కిదే హరి కాఁపురమా | ॥కరు॥ |
| గంట వేఁటలో తగులు కాఁపురమా కంట వత్తివెట్టి కాచే కాఁపురమా గంటుగిందుగాఁ బొరలే కాఁపురమా కంటిమి శ్రీపతికృప కాఁపురమా | ॥కరు॥ |
| కావిరి వెఱ్ఱి చేరాయి కాఁపురమా కావలసినట్లయ్యే కాఁపురమా శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్ను నన్ను నొక్క- కైవశము సేసెఁగదో కాఁపురమా | ॥కరు॥ |


