అధ్యాత్మ సంకీర్తన
రేకు: 106-5
సంపుటము: 2-35
రేకు: 106-5
సంపుటము: 2-35
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| వేసరకు వీఁడేల యనకుము విడువ నిన్నిఁక శరణు చొచ్చితి నీ సరెవ్వరు లేరు వెదకిన నిండుబండికిఁ జేటవేఁ గా | ॥పల్లవి॥ |
| మీరు నాకుఁ గలరు నేనేమి సేసినఁ గాతురనియెడి- ధీరతను జము సరకు గొనకే తివిరిఁ సేసితిఁ బాపము వోరసేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు వారికినిఁ గొరగాను నే నెవ్వరిని నెఱఁగను మిమ్మేకాని | ॥వేస॥ |
| మిమ్ముఁ గొలిచిన గర్వమున నేమీఁ జేయక కాలమందే నమ్మి కర్మములెల్ల మానితి నాకు నాకే వేసరి దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచుఁ బరాకుచేసిన యిమ్ములను నన్నవియు రోసును యేల నాకవి నీవేకాక | ॥వేస॥ |
| నీకు మొక్కిన మందెమేళము నే నొక కొండ సేసుక లోకముల దేవతలకెల్లను లోను వెలిగానైతి యీకడను శ్రీవేంకటేశుఁడ యిప్పుడిటు ననుఁ గరుణఁజూచితి చేకొనుచు వారె మెత్తురు చెలఁగి నీకింకరుఁడననుచు | ॥వేస॥ |


