అధ్యాత్మ సంకీర్తన
రేకు: 107-3
సంపుటము: 2-39
రేకు: 107-3
సంపుటము: 2-39
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించక పో దంతర్యామి | ॥పల్లవి॥ |
| సొమ్మువో వేసినవాఁడు చుట్టిచుట్టి వీథులెల్లా
కమ్ముక వెదకీనట కన్నదాఁకాను నమ్మిన అజ్ఞానములో నన్నుఁ బడవేసుకొని అమ్మరో వూరకుందురా అంతర్యామి | ॥నన్ను॥ |
| వోడ బేరమాడేవాఁడు వొకదరి చేరిచి
కూడిన యర్థము గాచుకొనీనట యీడనే ప్రపంచములో నిట్టె నన్ను దరిచేర్చి వోడక కాచుకోరాదా వో యంతర్యామి | ॥నన్ను॥ |
| చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
వూరకే శ్రీవేంకటేశ వోపికతోడ ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నాభార- మేరీతినైన మోవు మిఁక నంతర్యామి | ॥నన్ను॥ |


