అధ్యాత్మ సంకీర్తన
రేకు: 107-4
సంపుటము: 2-40
రేకు: 107-4
సంపుటము: 2-40
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| హరివారమైతిమి మమ్మవుఁ గాదనఁగరాదు తరముగా దిఁకను మాతప్పులు లోఁ గొనరో | ॥పల్లవి॥ |
| వెన్నడించి సూడువట్టే విష్ణుమాయ నీకు నేము యిన్నిటాఁ బంతమిచ్చేము యింకఁ గావరో నన్నల వెట్టిగొనేటి సంసారబంధము నీకు మున్నె కిందుపడితిమి ముంచి దయఁజూడవో | ॥హరి॥ |
| ఆడించేటి కామక్రోధాది జూజరులాల వోడితిమి మీకుఁ దొల్లె వొరయకురో వీడని కర్మము నీకు వెఱచి పూరి గఱచే- మీడనే ధర్మదార మా కిఁకనైనాఁ బట్టవో | ॥హరి॥ |
| దక్కఁగొన్న మాలోని తనుభోగములాల మొక్కితిమి మాకుఁ గొంత మొగమోడరో యెక్కువ శ్రీవేంకటేశు డేలే మాజన్మములాల గక్కన వేఁడుకొంటిమి కపటాలు మానరో | ॥హరి॥ |


