అధ్యాత్మ సంకీర్తన
రేకు: 108-1
సంపుటము: 2-43
రేకు: 108-1
సంపుటము: 2-43
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానే గురుతు | ॥పల్లవి॥ |
| పరమమంగళము భగవన్నామము సురులకు నరులకు శుభకరము యిరవుగ నెఱిఁగిన యెదుటనె వున్నది వరుసల మఱచినవారికి మాయ | ॥ఎవ్వ॥ |
| వేదాంతసారము విష్ణుభక్తి యిది ఆదిమునుల మత మయినది సాదించువారికి సర్వసాధనము కాదని తొలఁగిన గడుశూన్యంబు | ॥ఎవ్వ॥ |
| చేతినిధానము శ్రీవేంకటపతి యేతలఁ జూచిన నిందరికి నీతియు నిదియే నిజసేవకులకు పాతకులకు నది భవసాగరము | ॥ఎవ్వ॥ |


