అధ్యాత్మ సంకీర్తన
రేకు: 108-2
సంపుటము: 2-44
రేకు: 108-2
సంపుటము: 2-44
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| హరిదాసులతోడ నల్పులు సరెనరాదు గురుఁడు శిష్యుడుననే గుఱి దప్పుఁగానా | ॥పల్లవి॥ |
| కోరి ముత్యపుఁజిప్పలఁ గురిసిన వానయు సారెఁ బెంకులలో వాన సరియౌనా శ్రీరమణుఁ డిన్నిటానుఁ జేరియుంటేనుండెఁ గాక సారెకుఁ బాత్రాపాత్రసంగతింతా లేదా | ॥హరి॥ |
| మలయాద్రి మాఁకులును మహిమీఁది మాఁకులును చలమున నెంచిచూడ సరియౌనా అలరి దేవుఁడు అంతర్యామియైతేనాయఁ గాక తెలియఁగ క్షేత్రవాసి దిక్కులందు లేదా | ॥హరి॥ |
| అమరుల జన్మములు నసురల జన్మములు జమళిఁ బుట్టినంతలో సరియౌనా అమరి శ్రీవేంకటేశుఁ డాతుమైతేనాయఁ గాక తమితో నధికారిభేదములు లేవా | ॥హరి॥ |


