అధ్యాత్మ సంకీర్తన
రేకు: 108-3
సంపుటము: 2-45
రేకు: 108-3
సంపుటము: 2-45
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| నే ననఁగా నెంతవాఁడ నెయ్యపుజీవులలోన యీ నెపాన రక్షించీ నీశ్వరుఁడే కాక | ॥పల్లవి॥ |
| యెవ్వరు బుద్ధిచెప్పిరి యిలపైఁ జీమలకెల్లా నెవ్వగఁ బుట్టల గొల్చు నించుకొమ్మని అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలోఁ దవ్వించి తలకెత్తే యంతర్యామేకాక | ॥నేన॥ |
| చెట్టుల కెవ్వరు బుద్ధిచేప్పేరు తతికాలానఁ బుట్టి కాచి పూచి నిండాఁ బొదలుమని గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని తిట్టపెట్టి రచించిన దేవుఁ డింతేకాక | ॥నేన॥ |
| బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు తిద్ది చన్నుదాగి పూరి దినుమని పొద్దువొద్దులోన నుండి భోగములు మఱపిన- నిద్దపు శ్రీవేంకటాద్రినిలయుండే కాక | ॥నేన॥ |


