అధ్యాత్మ సంకీర్తన
రేకు: 108-5
సంపుటము: 2-47
రేకు: 108-5
సంపుటము: 2-47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు చాయల నీసుద్ది విని శరణంటి నేను | ॥పల్లవి॥ |
| కావలనంటేఁ దొల్లి కంభము చించుకవెళ్లి కైవశమై ప్రహ్లాదుఁ గావవా నీవు తేవలనంటే బ్రహ్మదేవునికి వేదములు సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు | ॥నీయం॥ |
| పట్టియెత్తవలెనంటేఁ బాతాళానఁ బడ్డ కొండ తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు మట్టుపెట్టవలెనంటే మరి భూమి చాపగాఁగ చుట్టుకపోతేఁ దెచ్చి సొంపుగ నిలుపవా | ॥నీయం॥ |
| పక్షపాతమయ్యేనంటేఁ బాండవుల గెలుపించి యీక్షితి యేలించి చనవియ్యవా నీవు రక్షించేనంటేఁ గాతరాన శ్రీవేంకటాద్రిఁ బ్ర- త్యక్షమై మావంటివారిఁ దగఁ గరుణించవా | ॥నీయం॥ |


