అధ్యాత్మ సంకీర్తన
రేకు: 109-1
సంపుటము: 2-49
రేకు: 109-1
సంపుటము: 2-49
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని దావతిఁ బడక యిది దక్కితే సులభము | ॥పల్లవి॥ |
| ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి దంటవాయువు గెలువఁ దలచేదెల్లా వెంటిక వట్టుకపోయి వెఁస గొండ వాఁకుట వెంటఁ గర్మమార్గమున విష్ణుని సాధించుట | ॥ఏవీ॥ |
| యేనుగుతోఁ బెనఁగుట యిల నిరాహారియై కానని పంచేంద్రియాలఁ గట్టఁబోవుట నానించినుపగుగిళ్ళు నములుట బలిమిని ధ్యానించి మనఁసుఁబట్టి దైవము సాధించుట | ॥ఏవీ॥ |
| దప్పికి నెండమావులు దాగ దగ్గరఁబోవుట తప్పుఁ జదువులలోఁ దత్త్వము నెంచుట పిప్పి చవి యడుగుట పెక్కు దైవాలఁ గొలిచి కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట | ॥ఏవీ॥ |


