అధ్యాత్మ సంకీర్తన
రేకు: 109-2
సంపుటము: 2-50
రేకు: 109-2
సంపుటము: 2-50
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| అప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు యిప్పు డిట్టిమహిమల నెక్కుడాయ నీతఁడు | ॥పల్లవి॥ |
| చేకొని తొలితొలుతే చేసిన పన్నీరుకాపు జోకఁ గాలువలై సొరిది జార సైకపునీలాద్రినుండి జలజల బారేటి- రేకల సెలయేరులరీతి నున్న దిదివో | ॥అప్పఁ॥ |
| తెప్పలుగా గుప్పినట్టి తెల్లని కప్పురకాపు చిప్పిలుచు వెన్నెలలై చిందఁగాను పుప్పొడిఁదోఁగిన కల్పభూజము నిలుచున్న- చొప్పున నున్నాఁడిదివో సొంపులు మీరుచును | ॥అప్పఁ॥ |
| పొందుగ నంతటిమీఁదఁ బూసిన పునుగుకాపు కందువ మాణిక్యముల గనియైనట్టు అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ చెంది యరతఁ గట్టఁగా శ్రీవిభుఁడై నిలిచె | ॥అప్పఁ॥ |


