అధ్యాత్మ సంకీర్తన
రేకు: 109-6
సంపుటము: 2-54
రేకు: 109-6
సంపుటము: 2-54
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నారాయణాచ్యుతానంత గోవిందా నేరరాదు విజ్ఞానము నీ వియ్యక లేదు | ॥పల్లవి॥ |
| నిగమాంతవిదులై తే నిన్నెఱుఁగుదురు గాక మృగసమానులకేల మీమీఁది భక్తి వెగటుగాఁ గృపతోడ విశ్వరూపు చూపినాను పగటు దుర్యోధనుఁడు బహురూప మనఁడా | ॥నారా॥ |
| చిరపుణ్యులైతే మీ సేవలు సేతురు గాక దురితచిత్తులకు మీత్రోవ యేఁటికి గరిమఁ బ్రత్యక్షమై కంబములోఁ గలిగినా హిరణ్యకశిపుఁడు మిమ్మెంచి శరణనెనా | ॥నారా॥ |
| దేవతలయితే మిమ్ముఁ దెలియనేర్తురు గాక యేవల నసురులు మిమ్మెఱిఁగేరా శ్రీవేంకటాద్రిమీఁద సిరితో నీ వుండఁగాను కేవల సంసారు లెఱిఁగియును మఱవరా | ॥నారా॥ |


