అధ్యాత్మ సంకీర్తన
రేకు: 110-5
సంపుటము: 2-59
రేకు: 110-5
సంపుటము: 2-59
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చెల్లఁబో తియ్యనినోరఁ జేఁదేఁటికి యీ- పల్లదపుఁ గోరికలపాలు సేయవలెనా | ॥పల్లవి॥ |
| ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట దాసునిఁగా నాపాలిదైవమా నీవు పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా | ॥చెల్లఁ॥ |
| పామరపు టింద్రియాలబారిఁ దోసితివి నన్ను దామెనకట్టుగాఁ గట్టి తత్త్వమా నీవు దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి పామేటి సుఖములనే భ్రమయించవలెనా | ॥చెల్లఁ॥ |
| గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు దిక్కుదెసవై నాకు దేవుఁడవై యేలికవు చొక్కి నామనసింత సోదించవలెనా | ॥చెల్లఁ॥ |


