Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 111-1
సంపుటము: 2-61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఏ గతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము
భోగపుఁ గోరికలచే బొలిసెఁ బో పనులు
॥పల్లవి॥
పరగి నాలుకసొంపు పరసిపోయ
పరులనే నుతియించి పలుమారును
విరసపుఁ బాపముల విని‌కిచే వీనులెల్లాఁ
గొరమాలె మాకు నేఁటి కులాచారములు
॥ఏగ॥
మెుక్కలానఁ బరధనమునకుఁ జాఁచి చాఁచి
యెక్కువఁ జేతుల మహిమెందో పోయ
తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ది
ముక్కపోయ మాకు నేఁటిముందరి పుణ్యములు
॥ఏగ॥
యెప్పుడు నీచుల‌ ఇండ్ల కెడతాఁకి పాదములు
తప్పని తపములెల్లాఁ దలఁగిపోయ
యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గొలువఁగా
నెప్పున నేఁ జేసినట్టి నేరమెల్లా నడఁగె
॥ఏగ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము