అధ్యాత్మ సంకీర్తన
రేకు: 111-3
సంపుటము: 2-63
రేకు: 111-3
సంపుటము: 2-63
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| చిక్కువడ్డ పనికిఁ జేసినదే చేఁత లెక్కలేని యప్పునకు లేమే కలిమి | ॥పల్లవి॥ |
| తగవులేమి కెదిరిధనమే తనసొమ్ము జగడగానికి విరసమే కూడు తెగుదెంపులేమికి దీనగతే దిక్కు బిగువుఁగూటికి వట్టిబీరమే తగవు | ॥చిక్కు॥ |
| పతిలేనిభూమికి బలవంతుఁడే రాజు గతిలేనికూటికిఁ గన్నదే కూడు సతిలేనివానికి జరగినదే యాలు కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు | ॥చిక్కు॥ |
| యెదురులేమికిఁ దమకేదైనఁ దలఁ పిది మదమత్తునకుఁ దనమఱుపే మాట తుదిపదమునకుఁ జేదొడైన(???) విభవము పదిలపు శ్రీవేంకటపతియే యెఱుక | ॥చిక్కు॥ |


