Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 111-4
సంపుటము: 2-64
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
అన్నిటికి నొడయఁడవై న శ్రీపతివి నీవు
యెన్నరాదు మా బలఁగఁ మెంచుకో మా పౌఁజు
॥పల్లవి॥
జ్ఞానంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపు కామక్రోధాల వర్గము లారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు
॥అన్ని॥
తప్పనిగుణాలు మూఁడు తనువికారము లారు
అప్పటి మనోబుద్ధ్యహంకారాలు
వుప్పతిల్లు విషయము లుడివోని వొక‌అయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌఁజు
॥అన్ని॥
ఆఁకలిదప్పియును మానావమానములను
సోఁకిన శీతోష్ణాలు సుఖదుఃఖాలు
మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేఁకటారఁ గడపేవా నెంచుకో మాపౌఁజు
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము