అధ్యాత్మ సంకీర్తన
రేకు: 112-2
సంపుటము: 2-68
రేకు: 112-2
సంపుటము: 2-68
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అన్నిటా శ్రీహరిదాసుఁడగు వానికి కొన్ని దైవములఁ గొలువఁగఁ దగునా | ॥పల్లవి॥ |
| విహితకర్మముసేసి వెదకేటి హరి నిట్టె సహజమై కొలచేటి సరసునికి గహనపుఁ గర్మాలు కడమలైన నేమి మహిఁ గనక్రాదికి మరి పైఁడి వలెనా | ॥అన్ని॥ |
| పలుదానములకెల్ల బలమైన హరి నిట్టె బలుపుగ జేకొన్న భక్తునికిని నెలకొని యాతఁ డన్నియునుఁ జేసినవాఁడె తెలిసి సూర్యునిఁ జూడ దీపాలు వలెనా | ॥అన్ని॥ |
| వేదవేద్యుఁడు శ్రీవేంకటపతినామ- మాదిగాఁ బఠియించే యధికునికి ఆదైన చదువులు అఱచేతి వతనికి మేదినిఁ దిరుగాడ మెట్లు వలెనా | ॥అన్ని॥ |


