Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 112-4
సంపుటము: 2-70
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఎంత బాఁప నా సోద మింత గలదా
అంతయు నీమహిమే హరిభట్లూ
॥పల్లవి॥
సూరిభట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి
వారబియ్య మెత్తియెత్తి వడదాఁకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారవట్టీ
కేరికేరి నగవయ్య క్రిష్ణభట్లూ
॥ఎంత॥
దేవరొజ్ఝ లొకవంక దిక్కులలోఁ బొలగూడు
దీవెనతో నారగించి తీపుమరిగి
యీవలఁ బెట్టినవారికేమైనా నొసఁగీని
వేవేలు మాయల విష్ణుభట్లూ
॥ఎంత॥
సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా
నామనితో విందువెట్టీ ననుదినము
హోమపు విప్రులసొమ్ము లొడిసి తాఁ బుచ్చుకొని
వేమరు శ్రీవేంకటాద్రి వెన్నుభట్లూ
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము