Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 112-5
సంపుటము: 2-71
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
అటుగన నే రోయఁగఁ దగవా
నటనల శ్రీహరి నటమింతే
॥పల్లవి॥
చిడుముడి మూఁగిన జీవులలోపల
కడఁగి నే నొక్కఁడ నింతే
విడువక పక్షులు వృక్షము లిలపై
వెడఁగు భోగములు వెదకీనా
॥అటు॥
తనువుల వెూచిన తగుప్రాణులలోఁ
గనుఁగొన నొకమశకమ నింతే
మునుకొని కీటకములుఁ జీమలు నిల
చెనకి దొరతనము సేసీనా
॥అటు॥
శ్రీవేంకటపతిసేవవారిలో
సోవల నొకదాసుఁడ నేను
భావించి సురలు బ్రహ్మాదు లతని-
దైవపు మాయలు దాఁటేరా
॥అటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము