అధ్యాత్మ సంకీర్తన
రేకు: 113-2
సంపుటము: 2-74
రేకు: 113-2
సంపుటము: 2-74
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నమ్మిన దొకటే నాకు నీశరణము యెమ్మెల సంసార మింతే యిందేమిగలదు | ॥పల్లవి॥ |
| యేఁటికర్మము నా కేఁటిధర్మము యేఁటిదో నేఁ జేయఁగా నీ కేమి గూడెను నాఁటకపు తొంటివారు నడిచిన మార్గమని యీఁటుకుఁ జేఁసేఁగాక యిందేమి గలదు | ॥నమ్మి॥ |
| యేడతపము నా కేడజపము నే వాడికఁ జేయఁగ నీకు వచ్చినదేమి బెడిదపుఁ బెద్దలెల్లాఁ బెట్టిన తిట్టములంటా యీడుకుఁ జేసెఁగాక యిందేమి గలదు | ॥నమ్మి॥ |
| యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములు యిక్కువ నన్నిట్లఁ జేసి యేమిగంటివి నిక్కెపు శ్రీవేంకటేశ నిన్నుఁ గనుటగాక యెక్కడి కెక్కడిమాయ లిందేమి గలదు | ॥నమ్మి॥ |


