అధ్యాత్మ సంకీర్తన
రేకు: 115-1
సంపుటము: 2-85
రేకు: 115-1
సంపుటము: 2-85
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| నాటికి నాఁడు గొత్త నేటికి నేఁడు గొత్త నాటకపు దైవమవు నమో నమో | ॥పల్లవి॥ |
| సిరుల రుక్మాంగదుచేతి కత్తిధారఁ దొల్లి వరస ధర్మాంగదుపై వనమాలాయ హరి నీకృపకలిమి నట్లనే అరులచే కరిఖడ్గధార నాకుఁ గలువదండాయ | ॥నాటి॥ |
| మునుప హరిశ్చంద్రు మొనకత్తిధారఁ దొల్లి పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి- ఘనఖడ్గధార నాకుఁ గస్తూరివాటాయ | ॥నాటి॥ |
| చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుషముఁ బెడఁబాపి కాచినట్టు అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియుఁ బాపి యిల నన్నుఁ గాచినది యెన్నఁ గతలాయ | ॥నాటి॥ |


