అధ్యాత్మ సంకీర్తన
రేకు: 115-3
సంపుటము: 2-87
రేకు: 115-3
సంపుటము: 2-87
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| కామధేనువై కలిగె నీధరణి వాములు వలసినవారికి విధులు | ॥పల్లవి॥ |
| అందరు జీవులే ఆయాకర్మముఁ బొంది బుద్ధు లెప్పుడు వేరు కొందరు స్వర్గము గోరి సుఖింతురు కొందరు నరకానఁ గూలుదురు | ॥కామ॥ |
| దేవుఁ డిందరికి దిక్కై యుండును భావాభావమే బహువిధము దేవత లమృతాధీనమై మనిరి తోవనె దనుజులు దురిత మందిరి | ॥కామ॥ |
| పుట్టు గందరికి పొంచి కలిగినదె దట్టపుమనసులే తమకొలఁది యిట్టే శ్రీవేంకటేశుఁడు సేసిన యట్లౌ నాతఁడు అదివో యెదుట | ॥కామ॥ |


