అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-6
సంపుటము: 1-6
రేకు: 1-6
సంపుటము: 1-6
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
మానుషము గాదు మఱి దైవికము గాని రానున్నా అది రాకుమన్నఁ బోదు | ॥మానుష॥ |
అనుభవానకుఁ బ్రాప్తమైనది తనకుఁ దానె వచ్చి తగిలి కాని పోదు | ॥మానుష॥ |
తిరువేంకటగిరిదేవుని- కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు | ॥మానుష॥ |