అధ్యాత్మ సంకీర్తన
రేకు: 115-4
సంపుటము: 2-88
రేకు: 115-4
సంపుటము: 2-88
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఏ పురాణముల నెంత వెదకినా శ్రీపతిదాసులు చెడరెన్నఁడును | ॥పల్లవి॥ |
| హరివిరహితములు అవి గొన్నాళ్ళకు విరసంబులు మరి విఫలములు నరహరిఁ గొలిచిటు నమ్మిన వరములు నిరతము లెన్నఁడు నెలవులు చెడవు | ॥ఏ పు॥ |
| కమలాక్షుని మతిఁగానని చదువులు కుమతంబులు బహుకుపథములు జమళి నచ్యుతుని సమారాధనలు విమలములే కాని వితథముగావు | ॥ఏ పు॥ |
| శ్రీవల్లభుగతిఁ జేరని పదవులు దావతులు కపటధర్మములు శ్రీవేంకటపతి సేవించు సేవలు పావనము లధికభాగ్యపు సిరులు | ॥ఏ పు॥ |


