అధ్యాత్మ సంకీర్తన
రేకు: 115-5
సంపుటము: 2-89
రేకు: 115-5
సంపుటము: 2-89
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఏలోకమందున్నా నేమి లేదు తాలిమి నందుకుఁ దగ్గ దావతే కాని | ॥పల్లవి॥ |
| సురల కసురలకు సూడునుఁ బాడునే కాని పొరసి సుఖించఁగఁ బొద్దు లేదు ధరలో ఋషులకు తపము సేయనే కాని మరిగి భోగించఁగ మరి పొద్దు లేదు | ॥ఏలో॥ |
| గక్కన సిద్ధులకైనా గంతయు బొంతయే కాని చిక్కి పరుసము గలిగి సెలవు లేదు రెక్కలుగల పక్షికి రేసుతిమ్మటలే కాని చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు | ॥ఏలో॥ |
| సకల జంతువులకు జన్మాదులే కాని అకటా నిత్యానంద మందలేదు వెకలి శ్రీవేంకటేశువిష్ణుదాసులకే మంచి- సుకములెల్లాఁ గలవు సుడివడలేదు | ॥ఏలో॥ |


