అధ్యాత్మ సంకీర్తన
రేకు: 116-1
సంపుటము: 2-91
రేకు: 116-1
సంపుటము: 2-91
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| విఱిగిరి దానవవీరు లదె అఱిముఱి దేవత లాడేరదె | ॥పల్లవి॥ |
| పరగుకంభ మదె పగిలె పగిలె నదె హరినరసింహంబాయ నదె గరుడధ్వజ మదె ఘనచక్రం బదె మొరసేటి శంకపుమ్రోత లవె | ॥విఱి॥ |
| వెడలె వెడలె నదె వెనుకొని హిరణ్యుఁ దొడికిపట్టె నదె తొడమీఁద విడువక చించిన వేయిచేతులవె కడపమీఁదనే కదలఁడదె | ॥విఱి॥ |
| అదె వామాంకంబందు లక్ష్మి యదె కదిసి శాంతమదే కరుణ యదె వుదుటున ప్రహ్లాదు నూరడించె నదె యిదె శ్రీవేంకటమెక్కె నదె | ॥విఱి॥ |


