అధ్యాత్మ సంకీర్తన
రేకు: 116-3
సంపుటము: 2-93
రేకు: 116-3
సంపుటము: 2-93
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| దేవశిఖామణి దివిజులు వొగడఁగ వేవేలు గతులు వెలసీ వాఁడే | ॥పల్లవి॥ |
| వీదుల వీదుల వెసఁ దురగముపై భేదిల బల్లెము బిరబిరఁ దిప్పుచు మోదముతోడుత మోహనమూరితి యే దెసచూచిన నేఁగీ వాఁడే | ॥దేవ॥ |
| కన్నులు దిప్పుచు కర్ణములు గదల సన్నల రాగెకు చౌకళింపుచును అన్నిటఁ దేజి యాడఁగ దేవుఁడు తిన్నఁగ వాగేలు దిప్పీ వాఁడే | ॥దేవ॥ |
| వలగొనఁ దిరుగుచు వాలము విసరుచు నిలిచి గుఱ్ఱ మటు నేర్పులు చూపఁగ బలుశ్రీవేంకటపతి యహోబలపుఁ బొలమున సారెకుఁ బొదలీ వాఁడే | ॥దేవ॥ |


