అధ్యాత్మ సంకీర్తన
రేకు: 117-1
సంపుటము: 2-97
రేకు: 117-1
సంపుటము: 2-97
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఇట్టిజీవుల కింక నేది వాటి దట్టమై దేవుఁడ నీవే దయఁజూతు గాకా | ॥పల్లవి॥ |
| తనజన్మవిదు(ధు )లనుఁ దలఁచు నొక్కొకవేళ వొనర మఱచునట్టె వొక్కొకవేళ వినుఁ బురాణకథలు వివరించి యొకవేళ పెనచి సందేహములె పెంచు నొకవేళ | ॥ఇట్టి॥ |
| విసిగి సంసారమందు విరతుఁడౌ నొకవేళ వొఁసగి యందె మత్తుఁడౌ నొకవేళ పసిగొని యింద్రియాల బంటై వుండు నొకవేళ ముసిపితో దైవానకు మొక్కు నొక్కవేళ | ॥ఇట్టి॥ |
| కోరి తపములు చేసి గుణియౌ తా నొకవేళ వూరకే అలసి వుండు నొక్కవేళ యీరీతి శ్రీవేంకటేశ యెదలో నీవుండఁగాను బీరాన నీకే మొఱవెట్టు నొకవేళ | ॥ఇట్టి॥ |


