అధ్యాత్మ సంకీర్తన
రేకు: 117-6
సంపుటము: 2-102
రేకు: 117-6
సంపుటము: 2-102
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎన్నఁడొకో బుద్ధెరిఁగి యీడేరేది జంతువుల యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి | ॥పల్లవి॥ |
| కావించి నీపాదతీర్థగంగ ప్రవాహమైనది పావనులై యిందరిని బ్రదుకుమని లావుగా నీప్రసాదతులసి నారువోశున్నది వేవేలు పాతకాలెల్ల విదళించుమనుచు | ॥ఎన్నఁ॥ |
| చింతల నీమూర్తులు శిలాశాసనాలైనవి పంతముతోఁ గొలిచిట్టె బ్రదుకుమని బంతినే నీనామములు ప్రతిధ్వనులై వున్నవి దొంతులైన భవముల తుద గనుమనుచు | ॥ఎన్నఁ॥ |
| అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి బందె దీర నీకు మ్రొక్కి బ్రదుకుమని అందపు శ్రీవేంకటేశ అంతరాత్మవై వున్నాఁడ- వెందు చూచిన విజ్ఞాన మింద కొండో యనుచు | ॥ఎన్నఁ॥ |


