అధ్యాత్మ సంకీర్తన
రేకు: 118-1
సంపుటము: 2-103
రేకు: 118-1
సంపుటము: 2-103
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| జీవునికి నిటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు కావక పోరాదు మాకుఁ గల యంతర్యామివి | ॥పల్లవి॥ |
| పైపై నెదురుకట్లఁ బంచదార వుండఁగాను చేపట్టి యడిగి తెచ్చి చేఁదు దిన్నట్లు పూపలైన చేతిలోనే పుణ్యములు వుండఁగాను పాపములు చవియంటాఁ బట్టబొయ్యీ జీవుఁడు | ॥జీవు॥ |
| యింటిలోనే నవరత్నా లెన్నియైనా నుండఁగాను కంటగించి గాజుఁబూస గట్టుకొన్నట్లు వెంటనే హరినామాలు వేయివేలై వుండఁగా జంట నితరమంత్రాలు జపియించీ జీవుఁడు | ॥జీవు॥ |
| చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండఁగాను వేసరక వెలయాలి వెతకినట్లు మేసుల శ్రీవేంకటేశ మీదాస్యమే వుండఁగా వాసిఁ బరులఁ గొలువనే వడిఁ గోరీ జీవుఁడు | ॥జీవు॥ |


