Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 118-4
సంపుటము: 2-106
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
నిరుహేతుక దయానిధివి నీవు
కరుణించు నీకు నొక్కటి విన్నపము
॥పల్లవి॥
దేవా నీమహిమ తెలియ నెవ్వరివశ-
మీవల నీవే గతెను టింతేకాక
భావించలేరు నిన్ను బ్రహ్మాదులు సహితము
నీవేడ నేనేడ నే నొక జంతువను
॥నిరు॥
చిత్తా హరి నాదిక్కు చేకొని యవలోకించవే
యిత్తల సంసారవార్ధి యీఁదుచున్నాఁడ
హత్తి చూచేవారేకాని అడ్డగించేవారు లేరు
పొత్తుల నాధర్మము పుణ్యము నీచేతిది
॥నిరు॥
అవధారు శ్రీవేంకటాధీశ నాజన్మము
కవిసి యింద్రియములఁ గట్టువడ్డాఁడ
జవళి నీపాదములే శరణము చొచ్చినాఁడ
తవిలి నీచిత్తమింతే తరవాత నిఁకను
॥నిరు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము