Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 118-5
సంపుటము: 2-107
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి విజయముఁ బొంది
దేవతలు చూడ దశదిక్కులకు నేసెను
॥పల్లవి॥
అరికమ్ము వేసెనట్టె అల్లనరకాసురుపై
మేరమీరి రావణునిమీఁద నేసెను
సారపుజలధిమీఁద జలములింకఁగ నేసె
దారి దప్పకుండ నేడుదాళ్లు దెగనేసె
॥శ్రీవేం॥
పగదీర మింటిమీఁది బాణునిమీఁద నేసె
మిగుల మెరసి మాయమృగము నేసె
జగములో రాక్షసుల సంహరముగ నేసె
నిగిడి రక్తగుండాలు నిండ నేసెను
॥శ్రీవేం॥
ఖరదూషణాదుల కడిఖండలుగ నేసె
సరుసఁ గుంభకర్ణునిఁ జావనేసెను
అరిది శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
గరుడనిమీఁద నెక్కి కంటువాయ నేసెను
॥శ్రీవేం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము