అధ్యాత్మ సంకీర్తన
రేకు: 119-2
సంపుటము: 2-110
రేకు: 119-2
సంపుటము: 2-110
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఇదివో వీదివీదుల నీతని తేరు యెదుట శ్రీవేంకటాద్రిని తేరు | ॥పల్లవి॥ |
| చట్టువడఁ దోలె నాఁడు సముద్రాలపైఁ దేరు ఘెుట్టుగాఁ దోలెను పౌండ్రకునిపైఁ దేరు జట్టిగొని తోలె జరాసంధునిపై నదె తేరు కొట్టి తోలె హంసడిచుకులపై(???) తేరు | ॥ఇది॥ |
| ఘోరమై కుంగఁగఁ దోలె కులగిరులపైఁ దేరు కౌరవసేనపై దోలె గక్కనఁ దేరు కోరి మధురమీఁద నక్రూరుఁ గూడ తోలెఁ దేరు ఆరసి సంధిమాటలు ఆడఁ దోలెఁ దేరు | ॥ఇది॥ |
| తచ్చి శిశుపాలాది దైత్యులపైఁ దోలెఁ దేరు పెచ్చుగాఁ దోలె రుక్మిణి పెండ్లి తేరు అచ్చపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి చెచ్చెరఁ దోలె దిక్కుల సింగారపుఁ దేరు | ॥ఇది॥ |


