అధ్యాత్మ సంకీర్తన
రేకు: 119-5
సంపుటము: 2-113
రేకు: 119-5
సంపుటము: 2-113
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| సిరిఁ దొడపై నిడి శ్రీనరసింహుఁడు యిరవుగ వరములనిచ్చీని వాడే | ॥పల్లవి॥ |
| ఘనమగు కోరలు కరాళవదనము చెనకుచు గొడసెటి జిహ్వయును నినిపుఁ గటమరలు నిటలలోచనము నొనరఁగ గొలువై యున్నాఁడు వాఁడే | ॥సిరిఁ॥ |
| చటులచక్రకరంబును శార్ఙ్గరంబుసు అటు వరదాభయహస్తములు పటుతరయోగపు పట్టబంధమును కటితటి జెలఁగఁగఁ గడఁగీ వాఁడే | ॥సిరిఁ॥ |
| పరపగు శేషుని పడగల నీడల అరుదగు రవిచంద్రాంకముల సిరులగద్దెపై శ్రీవేంకటేశుడు పరిపూర్ణుఁడై పరగీ వాఁడే | ॥సిరిఁ॥ |


