అధ్యాత్మ సంకీర్తన
రేకు: 120-2
సంపుటము: 2-116
రేకు: 120-2
సంపుటము: 2-116
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఇంతదేవుఁ డింక వేఁడీ యెంచి చూపుఁడా చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో | ॥పల్లవి॥ |
| వేసితే వేయురూపులు విశ్వరూప మితఁడు శ్రీసతీశుఁ డిందరిలో శ్రీమంతుఁడు భాసురపు భూమి మోచే బలవంతుఁ డిన్నిటాను దాసులైతే మన్నించు నీదైవముఁ గొలువరో | ॥ఇంత॥ |
| గుట్టున బ్రహ్మాండాలు కుక్షిలో నించినవాఁడు అట్టె దేవతల మొర లాలించేవాఁడు చిట్టకపు దానవుల చించి చెండాడేటివాఁడు ఇట్టే శరణంటేఁ గాచు నీతనిఁ గొలువరో | ॥ఇంత॥ |
| కాలముఁ గర్మము మాయ గల్పించినయట్టివాఁడు ఆలించి సర్వజీవుల అంతర్యామి వాలి శ్రీవేంకటపతై వరములిచ్చేటివాఁడు యేలీలఁ గొల్చిన మెచ్చు నీవిభుఁగొలువరో | ॥ఇంత॥ |


