అధ్యాత్మ సంకీర్తన
రేకు: 120-5
సంపుటము: 2-119
రేకు: 120-5
సంపుటము: 2-119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| కలిదోషములాల కడు నేల మీరేరు యిలధరుఁ డుండగాను యిఁకనేఁటి సుద్దులు | ॥పల్లవి॥ |
| జగములేలెడువాఁడు సర్వాంతరాత్ముఁడు జిగి నింక నీకీబుద్ధి చెప్పనోపఁడా నిగిడి పుట్టించేటివాఁడు నిండుక వుండేటివాఁడు తెగని కర్మములెల్ల తిద్దకేల మానును | ॥కలి॥ |
| దనుజులఁ గొట్టేవాఁడు ధర్మము నిలిపేవాఁడు పనిగొన్న దురితాలు పాపనేరఁడా కొనమొదలైనవాఁడు గురి దానైనవాడు వునికి మనికి సేయకూరకుండీనా | ॥కలి॥ |
| స్వతంత్రుడైనవాఁడు స్వామియైనవాఁడు గతియై దాసులనెల్లఁ గానకుండీనా యితఁడే శ్రీవేంకటేశుఁ డిందిరాపతైనవాఁడు సతతము మాకు నిట్టే సంపద లొసఁగఁడా | ॥కలి॥ |


