అధ్యాత్మ సంకీర్తన
రేకు: 120-6
సంపుటము: 2-120
రేకు: 120-6
సంపుటము: 2-120
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా | ॥పల్లవి॥ |
| అరయ జీవులకెల్లా నభేదమైతే గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము సొరిది నాతుమలోన సోహంభావనయైతే సరి మునుల దేవపూజలు చెల్లవు | ॥వాద॥ |
| సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే బహుయాగాది కర్మాల పస లేదు మహిలోని జననాలు మరణాలు మాయమైతే విహితాచారాలు సేయ విధే లేదు | ॥వాద॥ |
| ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప యిటు పురుషసూక్తాదు లివి మరేల అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే సటలాడుకొనేడి రాక్షసమత మవును | ॥వాద॥ |


