అధ్యాత్మ సంకీర్తన
రేకు: 131-3
సంపుటము: 2-123
రేకు: 131-3
సంపుటము: 2-123
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| వేఱొక భావనలేల వీనితోఁ బెనఁగనేల తూఱినందే హరిఁ గూర్చి తుదగంట గాక | ॥పల్లవి॥ |
| చూచే కన్నుల నేమిఁ జూడకుండవచ్చునా చూచినందెల్లా హరిఁ జూచుట గాక వేచిన వీనుల నేమీ వినకుండవచ్చునా కాచి యవే హరికథగా వింట గాక | ॥వేఱొ॥ |
| కోరేటి చవుల జిహ్వ గోరకుండవచ్చునా కోరిన చవుల హరిఁ గూర్చుట గాక ఆరీతి బారే మనసు అడఁచఁగవచ్చునా ఆరితేరి అన్నిటాను హరిఁ గంట గాక | ॥వేఱొ॥ |
| వొడలు మోచిన దేహి వోమకుండవచ్చునా వోడలు శ్రీహరిదనే వోముట గాక బడినే శ్రీవేంకటేశుఁ బాసివుండవచ్చునా యెడయ కందె సుఖియించుట గాక | ॥వేఱొ॥ |


