అధ్యాత్మ సంకీర్తన
రేకు: 131-4
సంపుటము: 2-124
రేకు: 131-4
సంపుటము: 2-124
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| ఏడనుందురో తాము యెన్నికెపౌఁజులు దాఁటి- రాడకాడే పొడచూపే రాహా మేలు | ॥పల్లవి॥ |
| యెలమి స్వప్నమనే యెడపుఁ జావడిలో వొలసి జీవుఁడు కొలువున్నపుడు వెలినున్న చైతన్యవిధుల దొరలచేతి- యలబలము గాన మాహా మేలు | ॥ఏడ॥ |
| ఉప్పడమయి దేహమనే వూరఁ బెద్దచావడి ఉప్పతిల్లి దేహి కొలువున్నపుడు చప్పుడుతో నింద్రియవిషయపరివారము అప్పుడు పారాడుదురు ఆహా మేలు | ॥ఏడ॥ |
| అక్కడ నిద్దురలనే అంతఃపురాల కేఁగి వుక్కున భోగాన నాత్మ వున్నపుడు యెక్కువ శ్రీవేంకటేశ యెవ్వరూ నాడకుఁ బోరు అక్కడా నీవే వుందు వాహా మేలు | ॥ఏడ॥ |


